గ్రామ పంచాయితీల అభివృద్ధి దిశగా అందరూ పని చేయాలి

0

గ్రామ పంచాయితీల అభివృద్ధి దిశగా అందరూ పని చేయాలి

BSBNEWS - KANDUKUR 

మండలంలోని అన్ని పంచాయతీల గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు అందరూ సమన్వయంతో పంచాయితీల అభివృద్ధికి కృషి చేయాలని కందుకూరు ఎంపీడీవో పి. రత్నజ్యోతి   అన్నారు. స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు పంచాయతీ అభివృద్ధి పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయుటకు ఈ శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. గ్రామ పంచాయతీలలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలలో అమలవుతున్న అన్ని శాఖల అభివృద్ధి సంక్షేమ పథకాలలో ఉన్న ఆర్థిక లబ్ధి, గ్రామ పంచాయతీలలో సాధారణ నిధుల లభ్యత, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి గ్రామపంచాయతీలకు విడుదలవుతున్న ఆర్థిక నిధులను, భౌగోళిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామాలలోని పెద్దలు, సామాజికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, స్థానికంగా ఉన్న ప్రభుత్వవేతర సంస్థలు, స్థానిక ప్రజల సమన్వయంతో గ్రామంలో కలిసికట్టుగా స్థానిక అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో గ్రామాలలో సుస్థిర అభివృద్ధిని సాధించడానికి గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జడ్పిటిసి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)