సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరసన

0

సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరసన

BSBNEWS - VALETEVARIPALEM


మండలంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజా పోరు కార్యక్రమం ఈనెల 8 నుండి 13 వరకు జరుగుతుందని అందులో భాగంగా గురువారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అనంతరం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేయడం జరిగిందని సిపిఎం మండల ఇన్చార్జి జీవీబీ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలేటివారిపాలెం, అంకభూపాలపురం, నలధలపూరు, బడేవారి పాలెం, మాలకొండ  తదితర గ్రామాలలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, ఆయా సమస్యలపై తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించి, జూనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం సమర్పించి, తహసిల్దార్ తో సమస్యలపై చర్చించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలల గడిచిందని, వంద రోజులు పండగ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. కానీ ఏ ఒక్క ప్రజా సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రధానంగా మండలంలో భూ సమస్య ఉన్నదని ఈ సమస్యపై అధికారులు స్పందించాలని కోరారు. అంక భూపాలపురం గ్రామంలో సర్వేనెంబర్ 300 నుండి 360వరకు సుమారు 400 ఎకరాల భూమిని గతంలో స్థానికేతరులైన చీరాల వాసులకు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ గ్రామంలో భూమిలేని నిరుపేదలు అనేక మంది ఉంటే వారికి ఇవ్వకుండా, స్థానికేతర్లకు ఎలా అప్పజెప్పారు అని ప్రశ్నించారు. నలదలపూరు గ్రామంలో  100 ఎకరాలు బంజర భూమి ఉన్నదని, ఆ భూమి పక్కన ఉన్న రైతులు అక్రమంగా సాగు చేసుకుంటున్నారని, ఆ భూమిని, గ్రామంలోని భూమి లేని నిరుపేదలకు ఎకరా చొప్పున పంపిణీ చేయాలని కోరారు. ఆక్రమణ గురైన వలేటివారిపాలెం ఎస్సీ, బీసీ స్మశాన స్థలంలో ఆక్రమణలను తొలగించాలని కోరారు. వలేటివారిపాలెంలోని వడ్డే పాలెం లో కనీస సౌకర్యాలు మంచినీళ్లు, వీధిలైట్లు, అడ్డ రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించి   అభివృద్ధి చేయాలని కోరారు. మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న కార్మికులపై వేధింపులు, తొలగింపులు ఆపాలని కోరారు. ఈ సమస్యలను అధికారులు జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. లేనట్లయితే పేదలందరిని సమీకరించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వలేటివారిపాలెం మండల నాయకులు దువ్వూరి జాన్, దార్ల మాధవరావు, సిఐటియు నాయకులు  త్రాసుల శ్రీనువాసులు, పర్రె. శివ, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)