హలో మాల చలో గుంటూరు ను విజయవంతం చేయండి - పాలేటి కోటేశ్వరరావు

0

 హలో మాల చలో గుంటూరు ను విజయవంతం చేయండి 

BSBNEWS - KANDUKUR 

  

హలో మాల చలో గుంటూరు కార్యక్రమం  విజయవంతం చేయాలని మంగళవారం అఖిలభారత మాల సంఘాల జేఏసీ నాయకత్వంలో కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు, వి.వి.పాలెం, లింగ సముద్రం, గుడ్లురు మండలాలలోని 10 గ్రామాలు అయిన కొండముడుసుపాలెం, మోపాడు, శింగమనేనిపల్లి, నందల పూర్, కలవళ్ళ, సీతారాంపురం, చిన్నపవని, పెద్ద పవని, ముత్యాలపాడు, అనుబోయినపల్లి గ్రామాలలో సుడిగాలి పర్యటన  చేయడం జరిగిందని జేఏసీ నాయకులు పాలేటి కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుడిగాలి పర్యటన ఉదయం 7.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.00 గంట వరకు సాగిందన్నారు. దళిత మాల ప్రజలు జేఏసీ నాయకత్వాన్ని సాదరంగా ఆహ్వానం పలికారన్నారు. ఎస్ సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం, క్రిమిలేయర్ వ్యతిరేక పోరాటంలో భాగంగా  రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీన నవంబర్ 26 ను పురస్కరించుకుని అమరావతి, గుంటూరు, నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట క్రిస్టియన్ గ్రౌండ్లో నవంబర్ 26న జరిగే మాలల మహా గర్జన సభకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎవరి గ్రామములో వారు స్వయంగా వనరులు సమకూర్చుకుని వాహనాలు పెట్టుకుని వచ్చి సభ ను విజయవంతం చేయాలని పిలుపునిస్తే ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం రెండు వాహనాలు తో బయలుదేరుతాము అని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)