అనధికార బారెన్ నిర్మిస్తే వారిపై చర్యలు తప్పవు - వేలం నిర్వహణ అధికారి.ఎం కిరణ్ కుమార్

0

అనధికార బారెన్ నిర్మిస్తే వారిపై చర్యలు తప్పవు

BSBNEWS - VALETEVARIPALEM 

మండలంలోని చెరువుకొమ్ము పాలెం గ్రామంలో పొగాకు పంట నియంత్రణ, నారు మళ్ళ యాజమాన్యం పొగ నాట్లు విడుపులు, అంతర్ సేద్యం, నీటి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, ఎరువుల యాజమాన్యంలపై రైతులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణ అధికారి ఎం.కిరణ్ మాట్లాడుతూ రైతు సోదరులు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే పంట పండిచాలని, అనధికార బ్యారన్ లు నిర్మాణం చేపట్ట వద్దని తెలిపారు. అలా చేస్తే చట్ట ప్రకారం నేరం అని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నారు మళ్ళలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని దీని ద్వారా నాణ్యమైన నారు వస్తుందని అన్నారు. ట్రే విధానం ద్వారా నారు సాగు చేయాలని కోరారు. దీని వలన పంట ఒకేసారి వస్తుందని తెలిపారు. రైతు సోదరులు విధిగా పొటాష్ ఎరువు వాడాలని కోరారు. దీని వలన నాణ్యమైన పొగాకు పండుతుందని తెలిపారు. నారు మల్లలో విపరీతంగా మందులు వాడకూడదని చెప్పారు. సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ వి.శివ కుమార్ మాట్లాడుతూ వివిధ దేశాలలో పొగాకు ఉత్పత్తి, దిగుబడి, డిమాండ్, సప్లై గురించి వివరించారు. పంట నియంత్రణ పై దృష్టి సారించి లాభదాయమైన ప్రత్యమ్నాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని కోరారు. పొగాకు రైతు సోదరులు విధిగా ప్రతి ఒక్కరూ 10 మొక్కలు వేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. దీని వలన వాతావరణ కాలుష్యం తగ్గుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు పల్లి రాజశేఖర్, మేనేజర్ ఐ.టి.సి, ఉన్నం శ్రీనివాస్ జి.పి.ఐ , శ్రీ రామాంజనేయులు పి.ఎస్.ఎస్,బోర్డు సిబ్బంది , రైతు సోదరులు తదితరులు  పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)