ఇది ప్రజా ప్రభుత్వం - ఎమ్మెల్యే ఇంటూరి

0

 ఇది ప్రజా ప్రభుత్వం - ఎమ్మెల్యే ఇంటూరి 

ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన బసిరెడ్డిపాలెం గ్రామస్తులు

BSBNEWS - GUDLUR 



మండలంలోని బసిరెడ్డిపాలెం గ్రామంలో గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో, కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా సోమవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మహిళలు, యువత ఘన స్వాగతం పలికారు. ముందుగా స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది నారా చంద్రబాబునాయుడుకి మాత్రమే సాధ్యమని ప్రజల విశ్వసించి మహాకూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పెంపుదల శాశ్వత వికలాంగులకు 15000 రూపాయలు పెన్షన్లు, అన్నా క్యాంటీన్, నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ, దీపం పథకం ద్వారా మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడం వంటి ఎన్నో పథకాలను అమలు చేశారని తెలిపారు. కందుకూరు నియోజకవర్గ ప్రజలు అతి తక్కువ కాలంలో తనపై ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించినందుకు కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో తనను గెలిపించుకున్న కార్యకర్తల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులకు  ప్రాజెక్టు ద్వారా నీరు అందించి ఈ సీజన్లో రైతులు వరి పంటకు నీరు అందించి రైతులు సంతోషంగా ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బసిరెడ్డిపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, నరాల మాల కొండారెడ్డి, ఉమ్మనేని సుబ్బారావు, పువ్వాడి వేణుగోపాల్, చెన్నారెడ్డి మహేష్ మరియు గ్రామ తెలుగు యువత మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు

Post a Comment

0Comments
Post a Comment (0)