ఆషాడేని ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ ఎస్ కే ఖాదర్ వలి

0

ఆషాడేని ఆకస్మికంగా తనిఖీ చేసిన డాక్టర్ ఎస్ కే ఖాదర్ వలి  

BSBNEWS - KANDUKUR 


మండలంలోని మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే ఆషాడే కార్యక్రమానికి జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబి ఆఫీసర్ డాక్టర్ ఎస్ కే ఖాదర్ వలి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాబ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వయోజన  బి సి జి వాక్సినేషన్ అందరూ కచ్చితంగా ఇచ్చిన టార్గెట్  పూర్తి చేయాలని చెప్పారు.  ఎన్ టి ఇ పి కార్యక్రమంలో భాగంగా అనుమానితులను గుర్తించి  క్వాలిటీ గల్ల, కళ్ళే సరైన పద్ధతిలో సేకరించి ల్యాబ్ కు పంపించి పాజిటివిటి రేటు పెంచాలని సూచించారు. అన్ని ఆరోగ్య కార్యక్రమాలు లక్ష్యాలను నూరు శాతం సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిణి డాక్టర్ ఎస్ డి జువేరియా బాను, సి హెచ్ ఓ వై. నీరజ, పి హెచ్ ఎన్  బి. వరలక్ష్మి , డి ఆర్ టి బి కోఆర్డినేటర్ ఇ.శ్రావణ్ కుమార్ , ఎస్ టి ఎస్ శ్రీమన్నారాయణ , ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ కే.ఫరూక్, హెల్త్ సూపర్వైజర్లు  యం. శ్రీనివాసరావు , ఎన్ వి సుశీల, సిహెచ్ వోలు , ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






Post a Comment

0Comments
Post a Comment (0)