ఓగురులో పొలం పిలుస్తుంది
BSBNEWS - KANDUKUR
మండలంలోని ఓగురు, వెంకటాద్రి పాలెం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ శాఖ ద్వారా 25 శాతం రాయితీతో రైతు సేవా కేంద్రాలలో శనగలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తప్పనిసరిగా ట్రైకోడెర్మ విరిడి పౌడర్ తో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి అని సూచించారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు. ప్రస్తుత రబీసీజన్లో రైతులు పంటలకు భీమా చేసుకోవాలని తద్వారా భీమా వర్తిస్తుందని తెలియజేసారు. ఎకరాకు వరి కి 168/,మినుము 38/- , శనగ 56, వేరుశనగ 60/ ప్రీమియం వరికి డిసెంబర్ 31 లోపల, మిగతా పంటలకు డిసెంబర్ 15లోపల చెల్లించుకోవాలని తెలియజేసారు. తదుపరి మినుము పంట పరిశీలించి మినుము లో రసం పీల్చే పురుగులు ఆశించకుండా మొదటిగా వేప నూనె 10మి. లీ ఒక లీటర్ నీటికి, క్లోరో పైరిఫాస్ 2.5మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ అధికారి షేక్ ఖాసిం, ఒగూరు గ్రామ వ్యవసాయ సహాయకులు కె శరత్ కుమార్, పశు వైద్య సహాయకులు షేక్ షాజహాన్,వెంకటాద్రి పాలెం గ్రామ వ్యవసాయ సహాయకులు నాగరాజు మరియు రెండు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.


