కందుకూరు డివైఎస్పీని కలిసిన మాజీ ఎమ్మెల్యే
BSBNEWS - KANDUKUR
కందుకూరు డివిజన్ సూపరింటెండెంట్ బాల సుబ్రహ్మణ్యంను మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సిపి కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం కందుకూరు డిఎస్పి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్ఛం అందించారు. ఈ సందర్భంగా బుర్ర మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గంలోని పలు సమస్యలను డి.ఎస్.పి దృష్టికి తీసుకుని వెళ్లి వాటిని పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా కందుకూరు నియోజకవర్గంలోని సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదు చేస్తున్న కేసులను పరిశీలించి వారిపై అక్రమ కేసులు నమోదు చేయకుండా తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించేటప్పుడు అతివేగం తోటి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఈ మధ్యకాలంలో గుండ్లపాలెం ఎస్సీ కాలనీలో అతివేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ ఒకతని తొక్కించటం ద్వారా కాలు విరిగిన సంఘటన కూడా జరిగిందన్నారు. ఇసుక తరలించేటప్పుడు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని రవాణా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి ని కోరారు. నియోజకవర్గంలో పర్మినెంట్ రేషన్ షాప్ డీలర్లను పోలీసుల ద్వారా ఒత్తిడి చేసి స్వాధీనం చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను కూడా సరైన విధానంలో లేవని వాటిని కూడా పరిశీలించి రేషన్ షాపు పర్మినెంటు డీలర్ల మీద ఒత్తిడి లేకుండా చూడాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. డివైఎస్పీ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని తెలియజేశారు. బుర్ర వెంట డివైఎస్పీని కలిసిన వారిలో మాజీ ఏఎంసీ చైర్మన్ తోకల కొండయ్య, రాష్ట్ర నాయకులు గణేష గంగిరెడ్డి, న్యాయవాది ముప్పవరపు కిషోర్, వైఎస్ఆర్సిపి నాయకులు చీమల వెంకటరాజా, రేణమాల అయ్యన్న, దగ్గుమాటి కోటయ్య, షేక్ రహీం, షేక్ బికారి, గోగినేని రామాంజనేయులు,షేక్ అబ్దుల్ కలాం తదితరులు ఉన్నారు.

