మేలైన వ్యవసాయం కోసమే పొలంబడి

0

మేలైన వ్యవసాయం కోసమే పొలంబడి

BSBNEWS - KANDUKUR 

మేలైన వ్యవసాయ సాగు పద్ధతులు (గ్యాప్)కోసమే అని పొలంబడి కార్యక్రమం అని మండల వ్యవసాయాధికారి వి. రాము అన్నారు. మండలంలోని మోపాడు గ్రామంలో పొలంబడి కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి వి రాము ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ రైతులు వ్యవసాయాన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సూచనల మేరకు సాగు చేసుకోవాలని  తెలియజేశారు. మోపాడు గ్రామ పరిధిలో వరి రకం కె ఎన్ ఎం 1638 నారుమడి, నాట్లు వేస్తున్నారని అన్నారు. డ్రమ్ సీడర్ తో వేసిన వరి పొలాలను పరిశీలించారు. కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జె.జ్యోతి మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకొనినచో తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చని సూచించారు. ప్రకృతి వ్యవసాయ అధికారిని డి. ధనమ్మ మాట్లాడుతూ ఆవు మూత్రం, ఆవు పేడతో బీజామృతం తయారు చేసుకొని విత్తనశుద్ధి ద్వారా తెగుళ్ల బారి నుండి కాపాడుకోవచ్చని సూచించారు. ప్రకృతి వ్యవసాయ మోడల్ మేకర్ పి. మాధవ మాట్లాడుతూ ఎ టీ మ్ మోడల్ లో పలు రకాల తృణ/చిరు ధాన్యాలు వేసుకొనుట గురించి వివరించారు, కందుకూరు రైతు బజారులో అన్ని రకాల కషాయాలు అందుబాటులొ వున్నాయని తెలియజేసారు.

Post a Comment

0Comments
Post a Comment (0)