పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

0

 పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

BSBNEWS - KANDUKUR 

పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా కల్పిస్తుందని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సిఎంఆర్ఎఫ్ చెక్కులను, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి)లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు వరంలాంటిదని పేర్కొన్నారు. పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి  రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు నియోజకవర్గంలో త్వరలో మరిన్ని  ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయటం జరుగుతుందని చెప్పారు. వలేటివారిపాలెం మండలం చెర్లోపాలెం గ్రామంకు చెందిన బూసి రంగయ్య తండ్రి పోతురాజు  143502/- రూపాయలు, వలేటివారిపాలెం మండలం కలవల్ల గ్రామంకు చెందిన పిట్టా ప్రవీణ్ తండ్రి పేరు బ్రహ్మయ్యకు 31500/- రూపాయలు, గుడ్లూరు గ్రామం చెందిన గద్దె కౌశిక్ చౌదరి తండ్రి పేరు శ్రీనివాసులుకు 365487/- రూపాయలు, లింగసముద్రం మండలం ఆర్ఆర్ పాలెం గ్రామంకు చెందిన కిలారి వినయ్ తండ్రి పేరు పుల్లయ్యకు 40,786/- రూపాయలు, గుడ్లూరు మండలం కొత్తపేట గ్రామంకు చెందిన జాజుల సుప్రజ భర్త ప్రభాకర్ రావుకు 27,070/- రూపాయలు అందజేయడం జరిగింది అని తెలిపారు. కందుకూరు నియోజకవర్గం లో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ముందస్తుగా ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నందుకు ఎల్ ఓ సిలను కందుకూరు మండలం విక్కిరాల పేట గ్రామం కు చెందిన దారా కళ్యాణి భర్త వేణు కు 2,00,000/- రూపాయలు, వలేటివారిపాలెం మండలం పోలినేనిపాలెం గ్రామంకు చెందిన అనుమోలు మాధవరావు తండ్రి పెద్దకోటయ్య కు 1,00,000/- రూపాయలు, గుడ్లూరు మండలం దప్పలంపాడు గ్రామంకు చెందిన  రావిపాటి సాయి సుమంత్ తండ్రి రాజశేఖర్ 1,00,000/- రూపాయలు మొత్తంగా నియోజకవర్గం మొత్తం 1008435/- రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం లబ్ధిదారులు చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పొడపాటి మహేష్,vఇతర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)