అమ్మపాలెంలో పొలం పిలుస్తుంది
BSBNEWS - VALETEVARIPALEM
మండలంలోని అమ్మపాలెం, రామచంద్రపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్ మాట్లాడుతూ ఈ రబీ సీజన్లో సాగు చేసిన వరి, మినుము, శనగ పంటలకు ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం క్రింద (పి ఎం ఎఫ్ బి వై) రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియం నగదు చెల్లించి సాగు చేసిన పంటలకు ఇన్సూరెన్స్ చేసుకోవాలని తెలిపారు. పంటల వారీగా ఇన్సూరెన్స్ వివరములు వరి ఎకరాకు 168/- రూపాయలు, మినుము ఎకరాకు 38/-రూపాయలు, శనగ ఎకరాకు 56/- రూపాయలు, పెసర 36/-రూపాయలు, వేరుశనగ 60/- రూపాయలు చెల్లించాలని వివరించారు. గ్రామ పరిధిలోని రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ, ఉద్యానవన సహాయకులను సంప్రదించి పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకోవాలని కోరారు. అనంతరం వరి, మినుము పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ముఖ్యంగా మినుము పంటలో మారుకా పురుగు గమనించడం జరిగింది అని అన్నారు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైన్ స్యాడ్ 0.3 ఎం.ఎల్ లేదా ఎమెక్టో బెంజువేట్ 0.4గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవన సహాయకులు పి. నాగరాజు, సిహెచ్ రవీంద్ర, పి శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.


