సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన నరేష్
BSBNEWS - కందుకూరు
స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 78వ పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ మాజీ సమన్వయకర్త చింతరబోయిన నరేష్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. త్యాగం, అంకితభావానికి ప్రతిరూపమైన పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వేడుకలు నిర్వహించటం చాలా ఆనందంగా ఉందన్నారు. రాజీవ్ గాంధీ మరణం తరువాత భయపడకుండా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరమని తిరిగి కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో దాదాపు 10సంవత్సరములు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సోనియా గాంధీ దని ఆయన అన్నారు. ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆమె ముందు ఉన్న సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ కి అప్పచెప్పి ప్రజల కోసం నేను పని చేస్తానని మహోన్నతమైనటువంటి ప్రధాని పదవిని త్యాగం చేసినటువంటి మహా నాయకురాలు సోనియా గాంధీ అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని మొదటి సంతకం చేస్తాను అని చెప్పి చెప్పిన మాట నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దగ్గుతుందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులులో ఒకనిగా కాంగ్రెస్ పార్టీ కోసం 20 సంవత్సరములు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నాను, పనిచేస్తూనే ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విగ్నేష్, పోతురాజు, రాము తదితరులు పాల్గొన్నారు.
