కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్
BSBNEWS - విజయవాడ
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ ప్రమాణస్వీకారం చేసి పదవి బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహా దారు మొహమ్మద్ షరీఫ్, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మైనారిటీ సోదరులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకారానికి భారీగా తరలివచ్చారు. అనంతరం మౌలానా మాట్లాడుతూ తన కష్టానికి గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నార లోకేష్ ఈ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముస్లింల అభివృద్ది కోసం అను నిత్యం ఉంటానని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మౌలానా ధన్యవాదాలు తెలిపారు.

