కూరగాయలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ

0

కూరగాయలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ

BSBNEWS - కందుకూరు


 కూరగాయలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం నందు కందుకూరు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డా.బి. నీహారిక  ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండ్లు, కూరగాయలతో విలువ ఆధారిత పదార్థాల తయారీపై మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. పండ్లు, కూరగాయలు నందు పీచు పదార్థాలు, సూక్ష్మ పోషకాలు (విటమిన్లు, ఖనిజాలు), ప్రత్యేక న్యూట్రాస్యూటికల్స్ సమృద్ధిగా ఉంటాయన్నారు. మనం రోజువారీ తీసుకునే ఆహారం నందు సమగ్ర పోషణ కొరకు కనీసం 500 గ్రాముల పండ్లు, కూరగాయలు కలిగి ఉండాలన్నారు. రాష్ట్రం నందు పండ్లు, కూరగాయలు ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నప్పటికీ, పండించిన పంటలో 30-40 శాతం వివిధ కారణాల వల్ల వినియోగానికి ముందే పాడై పోతుందన్నారు. ప్రస్తుతం పండ్ల ఉత్పత్తిలో 2 శాతం మాత్రమే ప్రాసెస్ చేయబడుతుందని, వీటికి విలువ జోడించుట వలన రైతులకు రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉంది అని అన్నారు. సాంప్రదాయ లేదా ఆధునిక ప్రాసెసింగ్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా, పండ్లు, కూరగాయల ఉత్పత్తుల యొక్క నిల్వ జీవితం పెరిగి ఏడాది పొడవునా వినియోగానికి అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామీణ స్వయం సహాయక మహిళకు, యువతకు చిన్న తరహా పండ్ల ప్రాసెసింగ్ ఆహార సంస్థల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో బాగంగా పండ్లతో జామ్, స్క్వాష్, టుట్టి ఫ్రూట్టి, చిప్స్, ప్రెసర్వ్, డ్రైడ్ ఫ్రూట్స్, క్యాoడి, సాస్ తయారు చేసి చూపించారు. హాజరైనవారికి కరపత్రికలు, సర్టిఫికేట్లు అంద చేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)