మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి సిద్ధం కండి

0

మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి సిద్ధం కండి

BSBNEWS - KANDUKUR 



కందుకూరు ప్రాంతీయ మండలాలలో ఉన్న రాష్ట్ర, జిల్లా, మండలాల బాధ్యులు మధ్యంతర కౌన్సిల్ సమావేశానికి సిద్ధం కావాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు వై అశోక్ బాబు పిలుపునిచ్చారు. రాష్ర్ట ఉపాద్యాయ సంఘం  (ఎస్ టి యు) ప్రాంతీయ మండలాల సమావేశం కందుకూరు ప్రాంతీయ కార్యాలయం నందు గద్దగుంట వెంకటేశ్వర అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వై అశోక్ బాబు మాట్లాడుతూ యాప్ ల భారాన్ని తగ్గించాలని, బోధనేతర పనులు అప్పగించొద్దని తదితర సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మధ్యకాలంలో పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థుల ప్రవర్తన చెడు సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉందని, ఆ విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత స్థాయికి వెళ్లాలంటే దానికి ఆద్యుడు, ఆరంభకుడు ,ప్రారంభకుడు ఉపాధ్యాయుడే అని అన్నారు. ఉపాధ్యాయులకు స్వేచ్ఛను ఇప్పుడున్న ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. రాష్ట్ర కౌన్సిలర్ పి కృష్ణయ్య మాట్లాడుతూ అపార్ నమోదు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 77% పూర్తి చేయడం జరిగిందన్నారు. దానికోసం ఇప్పటివరకు ప్రధానోపాధ్యాయులు సాయ శక్తుల ప్రయత్నం చేశారన్నారు. ఇంకా పెండింగ్ విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకొని దానిని పూర్తి చేయాలని కోరారు. అంతేగాని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల మీద ఒత్తిడి కలిగించవద్దని , ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్ ఎల్ ఎన్, లీడర్షిప్ శిక్షణా కార్యక్రమాలు నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో 26 జిల్లాల కేంద్రాలలో జరపాలని అన్నారు. జిల్లా నాయకులు మేకల మోహన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను నిర్వీర్యం చేస్తే నేటి ప్రభుత్వం ప్రతి వారంలో శుక్రవారం రోజున ఉపాధ్యాయ సంఘాలతో సమస్యల మీద సమీక్షించటం శుభ పరిణామం అని అన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు విద్యావ్యవస్థను మంచిగా చేసే దానికి దోహద పడుతుందని అన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య  మాట్లాడుతూ నేడు ఉపాధ్యాయు, ఉద్యోగ వర్గాలు అనుభవించే సౌలభ్యాలు గత నాయకుల త్యాగఫలం అని, ఎస్టియు నిర్మాణం పటిష్టంగా ఉండాలని ఎస్టియు అభివృద్ధికి నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల అధ్యక్షులు ఎస్కే ఆరిఫ్, వెయ్యి పాల మండల అధ్యక్షులు కేపీ జాన్సన్, మండల అధ్యక్షుడు ఎన్ రామయ్య, కందుకూరు మండల ఆర్థిక కార్యదర్శి కోటు మధు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

0Comments
Post a Comment (0)