సీనియర్ న్యాయవాది కెఎస్ఎన్ కు ఘన నివాళి
BSBNEWS - కందుకూరు
కందుకూరు బార్ అసోసియేషన్ హాల్ లో సీనియర్ న్యాయవాది కురుగంటి సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కురుగంటి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఇన్చార్జ్ ప్రెసిడెంట్ యు వి సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ శివకుమార్ లతో పాటు సీనియర్ న్యాయవాదులు బచ్చలి మురళీకృష్ణ, సన్నెబోయిన శ్రీనివాసులు, ఎం.మల్లిఖార్జున, పెన్నా క్రిష్ణయ్య, హరి కోటేశ్వరరావు, బట్టరుశెట్టి సాయిశంకర్, రాఘవేంద్ర, పెట్లూరి మురళి, ప్రసాద్ రెడ్డి, రాజశేఖర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

