నాకు ఉద్యోగ భద్రత కల్పించండి - అంగన్వాడి ఆవేదన
BSBNEWS - KANDUKUR
తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను రాజీనామా చేయమని హింసిస్తూ మనోవేదనకు గురి చేస్తున్నారని మండలంలోని ఓగూరు గ్రామ అంగన్వాడీ కార్యకర్త ఆవేదనను వ్యక్తం చేస్తుంది. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ తిరుమల శ్రీ పూజకు అంగన్వాడీ కార్యకర్త కళ్యాణి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త కళ్యాణి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎలాగైనా సరే నా చేత రాజీనామా చేయించే ప్రయత్నాలు చేస్తూ నన్ను ప్రతినిత్యం నీడలా వెంటాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నాపై సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందని దాంతో అధికారులు వచ్చి పిల్లల తల్లిదండ్రులను అంగన్వాడి సెంటర్ నుండి వచ్చిన ఫిర్యాదు సరైనదా కాదని అడిగి తెలుసుకున్నారు అని, అయితే ప్రజల నుండి అంగన్వాడి సెంటర్ పై వ్యతిరేకంగా ఎవరు చెప్పలేదని ఆమె తెలిపారు. దాంతో టిడిపి నాయకులు మాపై మరింత వత్తిడి తీసుకొస్తున్నారని ఆమె తెలిపారు. వారి నుండి నాకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె కోరారు. సిఐటియు నాయకులు ఎస్ఐ గౌస్, జి.వి. కుమార్ లో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో అన్నిచోట్ల ప్రస్తుతం అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను తీసివేసి వారికి నచ్చిన వారిని పెట్టుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని వాటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని వారు తెలిపారు. టిడిపి నాయకులు తప్పు చేస్తే మందలించాల్సిన ఎమ్మెల్యే చూస్తూ ఊరుకోవడం సరికాదని వారు ఆరోపించారు. అంగన్వాడి కార్యకర్తకు వస్తున్న బెదిరింపులు మానుకోకపోతే ఉద్యమ కార్యాచరణ చేయటం జరుగుతుందని వారు హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం పెట్టిన పరీక్షలలో రాసి ఉత్తీర్ణులై సంపాదించుకున్న ఉద్యోగమే అని వాటిని తీసే అధికారం నాయకులకి ఎక్కడుందని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.