పెదపూడి విజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన గోచిపాతల మోషే

0

 పెదపూడి విజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన గోచిపాతల మోషే

BSBNEWS - KANDUKUR 

ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కో- ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తాడేపల్లిలోని మాల కార్పొరేషన్ కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అంబేద్కర్ ప్రతిమను అందించిన అనంతరం శుభాకాంక్షలు తెలియజేసినట్లు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా పేదప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు మంచిపేరు తీసుకొని వచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీచేయాలని చైర్మన్ విజయ్ కుమార్ ను కోరినట్లు ఆయన వెల్లడించారు. స్పందించిన చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే కార్పొరేషన్ ద్వారా సంక్షేమ పథకాలు అందించెందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారని మీడియాకు తెలియజేశారు. చైర్మన్ ను కలిసిన వారిలో బిల్లా గ్రూప్ ఆఫ్ బిజినెస్ అధ్యక్షులు సాయి కృష్ణ నాయుడు , రావినూతల వెంకటేష్ తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)