ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి - అధికారులకు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశం
BSBNEWS - NELLORE
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీలను ఎక్కడా జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, జిల్లా పరిషత్ సీఈవో విద్యారమ, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి, డ్వామా పీడీ గంగాభవాని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను నిర్దిష్ట గడువులోగా పరిశీలించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రెవెన్యూ అంశాలకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజా కుమారి, జిల్లావ్యవసాయ అధికారి సత్యవాణి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఇ అశోక్, గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ డి.వెంకటరమణ, గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్,జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, ఐసిడిఎస్ పిడి హేనాసుజన్, సమగ్రశిక్ష ఏపిసి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

