బీదాకు శుభాకంక్షాలు తెలిపిన కందుకూరు టీడీపీ నేత పులిచర్ల వెంకటసుబ్బారెడ్డి.
BSBNEWS - KANDUKUR
తెలుగు దేశం పార్టీ తరపున రాజ్యసభకు నేడు నామినేషన్ వేసిన బీదా మస్తాన్ రావుకి కూటమి ప్రభుత్వం తరఫున పులిచర్ల వెంకట సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో శుభాకంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గొప్ప అవకాశాన్ని కలుగజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా లో విపిఆర్ తరువాత అంతటి మంచి మనిషి, సౌమ్యుడు, ఆపన్నులకు అండగనిలిచే గుణం, తలలో నాలుకలా అందరినీ ఆదరించే మనస్తత్వం ఉన్న సీనియర్ రాజకీయవేత్త మస్తాన్ రావుకి ఈ అవకాశం రావటం జిల్లా ప్రజలు హర్షించ దగ్గ విషయంగా భావిస్తున్నాం అని ఆయన తెలిపారు.

