అదానీ అవినీతిపై విచారణ జరిపించాలి

0

 అదానీ అవినీతిపై విచారణ జరిపించాలి

* జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ

BSBNEWS - BAPATLA 

అదానీ అవినీతి కుంభకోణంపై అదానీ గ్రూప్ కంపెనీలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే కార్యక్రమంలో భాగంగా బల్లికురవ తాహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడుతూ మణిపూర్ లో ఇటీవల జరిగిన హింసాత్మక పరిస్థితులపై పార్లమెంటులో చర్చ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాయుధబలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించాలన్నారు. నేడు పేదవాడు బ్రతికేందుకు వీలు లేకుండా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశం అటుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉన్నాయని తక్షణమే అధిక ధరలను నియంత్రించాలన్నారు. ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే నిరుద్యోగులందరికీ ఉద్యోగులు కల్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే విద్యుత్ ఛార్జీలు పెంపుదలను నిలిపివేయాలి అన్నారు. అమెరికాలోని న్యూయర్ రాష్ట్రములో ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో ఆదానీపై అవినీతి కేసు నమోదు అయిందని విద్యుత్ ఒప్పందాల కోసం దాదాపు 2100 కోట్ల రూపాయలు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇందులో అత్యధికంగా 1750 కోట్లు మన రాష్ట్రంలోనే గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్ట జెప్పినట్లు తెలుస్తుంది అన్నారు. ఫలితంగా రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారం మోపబడిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న ఒప్పందాలు అన్ని రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అదానీని తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాహసిల్దార్ రవికుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల బాధ్యులు వల్లెపు నరసింహం, అట్లూరి శ్రీనివాసరావు, నాగబోయిన శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)