తహసిల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బంకు ఎలా నిర్మిస్తారు..?
- దివి శివరాం
BSBNEWS - KANDUKUR
ప్రభుత్వ ఆస్తులైన ప్రభుత్వ కార్యాలయాల నడుమున ప్రైవేటు పెట్రోల్ బంకులకు ఎలా అనుమతి ఇస్తారని కందుకూరు అభివృద్ధి మండలి అధ్యక్షులు, కందుకూరు మాజీ ఎమ్మెల్యే దీవి శివరాం ద్వజమెత్తారు. పట్టణంలోని ఆదిత్య రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కందుకూరు అభివృద్ధి మండలి కందుకూరు అభివృద్ధికై పనిచేస్తుందని ఆయన అన్నారు. తహసిల్దార్ కార్యాలయ ఆవరణంలో దాదాపు ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఉన్నాయని ఆ కార్యాలయాలకు తమ సమస్యలపై ప్రజలు వస్తుంటారని అటువంటి సందర్భంలో అక్కడ పెట్రోల్ బంకు ఎలా నిర్మిస్తారు అని ఆయన ప్రశ్నించారు. సమస్య ఏ ప్రభుత్వంలో వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం దానిని పరిష్కరించే మార్గంగా ఉండాలని ఆయన సూచించారు. కందుకూరు అభివృద్ధి మండలి తరపున చేస్తున్న మా విన్నపాన్ని పట్టించుకోకుండా పెట్రోల్ బంక్ నిర్మాణం చేపడితే అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. సమస్యను కందుకూరు ఎమ్మెల్యే ఇంటర్ నాగేశ్వరరావు తో పాటు మంత్రి డోల వీర బాల వీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకువెళ్లామని వారు సంబంధిత మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రామాయపట్నం ఓడరేవు, రాళ్లపాడు ప్రాజెక్టు లకు ఉన్న అనేక సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే ముందుకు సాగాలని ఆయన కోరారు. కందుకూరు అభివృద్ధి మండలి కార్యదర్శి నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులైన తహసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా పెట్రోల్ బంకు పెట్టుకునేందుకు అనుమతులు ఇస్తారని అధికారులను సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులే ప్రైవేటు వ్యక్తులతో లాలూచీపడి ప్రజల ఆస్తులను ధారాధత్వం చేయటం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా పునరాలోచించి ప్రజల శ్రేయస్సుకు అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల సంక్షేమం కోసం వారి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారం కానీ ఎడల కందుకూరు అభివృద్ధి కమిటీ కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేసిన ప్రజల పక్షాన నిలుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు అభివృద్ధి కమిటీ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, ముప్పవరపు కిషోర్, బూసి సురేష్ బాబు, చింతరబోయిన నరేష్, రేణమాల అయ్యన్న, పులిచెర్ల వెంకట సుబ్బారెడ్డి, బి వెంకటేశ్వర్లు, తోకల వెంకటేశ్వర్లు, సుభాను తదితరులు పాల్గొన్నారు.

