ఆదాని అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి
- సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య
BSBNEWS - KANDUKUR
ఆదాని అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపీఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోకూరి మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని, గత ప్రభుత్వం ఆదానితో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. గౌతం అదానిపై అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైనందున కేంద్ర ప్రభుత్వం గౌతం ఆదానిని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ హుస్సేన్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మురళి, ఆనంద్ మోహన్, ఉప్పుటూరి మాధవరావు, నత్త రామారావు, కోటేశ్వరరావు, సీతారామయ్య, సుభాన్, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఎండ్లూరి వీరాంజనేయ కుమార్, జడ సునీల్ తదితరులు పాల్గొన్నారు.


.jpeg)