దెబ్బతిన్న పంటలు పరిశీలన

0

 దెబ్బతిన్న పంటలు పరిశీలన 

BSBNEWS - KANDUKUR 


మండలంలోని ఓగూరు, మహాదేవపురం, పలుకూరు, మోపాడు గ్రామాలలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం వలన దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయాధికారి వి.రాము ఆధ్వర్యంలో సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ పి అనసూయ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్  వెంకటేష్ పంటలను సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ప్రస్తుతం మినుము పంట పూత, పిందె దశలో ఉందని వర్షాల కారణంగా నీరు నిలబడకుండా కాలువలు తీసుకొని బయటకు పంపాలని  కోరారు. చల్లని వాతావరణం వలన బూడిద తెగులు రాకుండా ప్రియాగ్జర్ 1మి.లీ లేదా మైక్రో బుటానిల్ 2గ్రామ్ ఒక లీటర్ నీటికి లేదా అమిస్టర్ టాప్ 1మి. లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని, ఎల్లో మొసైక్ వైరస్ నివారణకు తెల్ల దోమ ఆశించకుండా అసెటమి ప్రైడ్ లేదా థయో మేథోజైమ్ 2 గ్రామ్, వేప నూనె 5 మి. లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని అన్నారు. ఆకు మచ్చ తెగులు నివారణకు  మాన్కోజెబ్ 2.5గ్రామ్, సాఫ్ 2.5 గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని సూచించారు. అగ్రోమిన్ మాక్స, 19:19:19 లేదా 13:0:45 పొడి ఎరువు 5గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. పొగాకు పొలం నాటు నుండి ఎదుగుదల దశలో ఉంది కావున పల్లపు ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అని, తెలియజేసారు. వడలిపోయి వేరు తెగులు ఆశించిన పొలాల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 2.0గ్రాములు లీటర్ నీటికి, ప్లాంటోమైసిన్ 1గ్రామ్ 10 లీటర్ నీటికి కలిపి మొక్కల వేరు భాగంలో పోయాలని, తోటలు పాలిపోయినట్లు అయితే 13:0:45 ఒక కేజి ఎకరానికి పిచికారి చేయాలి అని అన్నారు. వర్షాలు ఆగిన తర్వాత పొటాషియం సల్ఫేటు 1కేజి ఎకరానికి చొప్పున రెండు సార్లు పిచికారి చేయాలి అని తెలియజేసారు. వరి పంటలో నీరు నిలబడకుండా కాలువలు తీసుకొని బయటకు పంపాలని తెలిపారు. ఈకార్యక్రమంలో మూడు గ్రామ వ్యవసాయ సహాయకులు కె శరత్ కుమార్, షేక్ నజీర్, ఐ.బ్రాహ్మణి, ఇ. రమణయ్య ప్రకృతి వ్యవసాయ అధికారి పి మాధవ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)