కందుకూరు అభివృద్ధి మా మండలి లక్ష్యం.
BSBNEWS - KANDUKUR
కందుకూరు అభివృద్ధి మా మండలి లక్ష్యం అని కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి అధ్యక్షులు దివి శివరాం అన్నారు. స్థానిక ఓవీ రోడ్ లోని విజేత కన్ స్ట్రక్షన్ కార్యాలయం నందు నియోజకవర్గ మండల అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం మాజీ శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి మండలి అధ్యక్షులు దివి శివరాం అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు. కందుకూరు పట్టణ, నియోజకవర్గస్థాయిలో పలు అంశాలపై అభివృద్ధి మండల సమావేశంలో చర్చలు జరిగాయన్నారు. ఈ అంశాలను వివరించుటకు రేపు ఉదయం 11 గంటలకు కందుకూరు రిటైర్డ్ ఎంప్లాయిస్ కార్యాలయము నందు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈసమావేశంలో కార్యదర్శి నేతి మహేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలేటి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి బూసి సురేష్ బాబు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, గౌరవ సభ్యులు తోకల వెంకటేశ్వర్లు, రేణమాల అయ్యన్న, పులిచెర్ల వెంకట సుబ్బారెడ్డి,చింతర బోయిన నరేష్, అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

