రోడ్డు ఎక్కిన విద్యుత్ మీటర్ రీడర్స్

0

రోడ్డు ఎక్కిన విద్యుత్ మీటర్ రీడర్స్న్యా

యమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం

BSBNEWS - KANDUKUR 



ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు డివిజన్ లో విద్యుత్ డిపార్ట్మెంట్ లో పనిచేసే మీటర్ రీడర్స్ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కార్యాలయం దగ్గర మంగళవారం ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద మోహన్ ఆధ్వర్యంలో విద్యుత్ మీటర్స్ రీడర్స్ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా మీటర్ రీడర్స్ కార్యదర్శి కుంచాల సిద్దయ్య మాట్లాడుతూ మేము గత 10 - 15 సంవత్సరాలనుండి విద్యుత్ డిపార్ట్మెంట్లో మీటర్ రీడర్స్ గా పనిచేస్తున్నాము అయితే ఇప్పుడు మా ఉపాధికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వము స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు అని, వాటి వల్ల మాకు ప్రమాదం పొంచి ఉందని స్మార్ట్ మీటర్ కి సిమ్ సిస్టం పెట్టడం వల్ల నెలనెలా ప్రతి ఇంటికి తిరిగి రీడింగు తీసే పనిలేదని వాపోయారు. ఇన్నాళ్లు సంస్థకు సేవలు చేయటంలో వెన్నుముక లాగా ఉన్నామని, నేడు అటువంటి వెన్నుముక విరిగిపోయే పరిస్థితిలో ఉందని వాపోయారు. మా సమస్యను పలుసార్లు ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల ద్వారా తీసుకెళ్లామని, అయినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికే కేటగిరి 2 అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగిచ్చేసారని దీనివల్ల పొమ్మన్నకనే పొగ పెట్టినట్టు మా పరిస్థితి తయారు అయిందని అందువల్ల మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. విద్యుత్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని తీసుకోవాలని,  నెల శాలరీలు ఇవ్వాలని, ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల ద్వారా మా పోరాటం కొనసాగిస్తున్నామన్నారు.  మా సమస్య పరిష్కారం కానీ ఎడల 

ఈనెల 20వ తేదీన జిల్లా ఎస్ ఈ  కార్యాలయం ముందు ధర్నా చేపడతామని, 24న కలెక్టర్ కి వినతి పత్రం, 27న సిఎండి ఆఫీస్ ముందు ధర్నా  కార్యక్రమం చేస్తామని, అప్పటికీ మా సమస్య పరిష్కారం కాకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రీడింగ్ తీయకుండా సమ్మె బాట పడతామని, 4వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. మా సమస్య తీరేంతవరకు విజయవాడలో సమ్మె  విరమించేది లేదని అన్నారు. కందుకూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బి. సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వము తీసుకొచ్చిన స్పాట్ మీటర్ల వల్ల సంవత్సరాలుగా మీటర్ రీడర్స్ విద్యుత్ డిపార్ట్మెంట్లో సేవలందిస్తూ వచ్చారని, నేడు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ వల్ల వీళ్ళ బతుకులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అని అన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ సమస్యను వెంటనే పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీటర్ రీడర్స్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ. మాలాద్రి, కందుకూరు డివిజన్ అధ్యక్షుడు డి.శ్రీను, డివిజన్ కోశాధికారి జే. రాము, రీడర్స్ టి.శివ, మల్లికార్జున, వంశీకృష్ణ, మధు కుమార్, నరేష్, సురేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)