తప్పు చేయకుంటే వివరణ ఎందుకు ఇవ్వట్లేదు
ఆ బ్యాచ్ అంటూ పక్కదారి పట్టించటం సబబు కాదు
- నేతి మహేశ్వరరావు
BSBNEWS - KANDUKUR
రామాయపట్నం పోర్టు కాంట్రాక్టర్ ని డబ్బులు అడిగారు అని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వచ్చిన శీర్షిక మీద వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులలో వివరణ ఇవ్వకుండా ఆ బ్యాచ్ అంటూ కందుకూరు ఎంఎల్ఏ ఇంటూరి నాగేశ్వరరావు స్థానిక నాయకత్వం మీద పెట్టి విషయాన్ని పక్క దారిపరచటం సబబు కాదని ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నీతి మహేశ్వర రావు అన్నారు. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ జోన్ సి కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పు చేయకుంటే వివరణ ఇవ్వచ్చు కదా అని అన్నారు. ఆంధ్రజ్యోతి లాంటి టిడిపి అనుకూల పత్రికలో మొదటి పేజీలో వార్త వేపించగలిగిన స్థాయిలో స్థానిక నాయకత్వం ఉన్నట్లు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడడం చూస్తుంటె అసలు అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఆత్మ లాంటి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వార్త రావడం అది కూడా ఒక ఎమ్మెల్యే మీద అవినీతి అరాచకం అన్నట్లు వార్తను ప్రచురించిన విధానాన్ని చూస్తే పార్టీ అధినాయకత్వమే పేపర్ ద్వారా మాట్లాడించింది అనడంలో సందేహం లేదన్నారు. ఇక్కడ మేము టిడిపి అధినాయకత్వాన్ని అడుగుతున్నది ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన శీర్షిక తప్పు అయితే ఖండించాలి లేదా వాస్తవ పరిస్థితులు ఉంటే ఎమ్మెల్యేని మందలించడం లేదా సస్పెండ్ చేయాలి ఇవేవీ చేయకుండా మౌనంగా ఉండడం అంటే మొత్తం వ్యవహారం పార్టీ అధినాయకత్వం కనుసనల్లోనే జరిగిందని భావించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
నవ యుగ సంస్థ కూడా ఈ ఆరోపణలలో వాస్తవాలు ఉంటే ఆధారాలతో బయటపెట్టాలి అని లేనిపక్షంలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అన్నారు.
అభివృద్ధి చెందాలి అంటే రైతులను మెప్పించి ఒప్పించి భూ సేకరణ చేసే విధానం ఉండాలి అని, రైతులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అని, రైతులకు ఉన్న అసైన్ భూములను కూడా అమరావతి తరహాలో పరిగణలోకి తీసుకొని పరిహారం ఇవ్వాలి అని అన్నారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు కాబట్టి ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అని, చాలామంది రైతులు ఇప్పటికీ ఆందోళన చేస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. రామాయపట్నం రైతుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించే తత్వం ఉంటేనే కొత్తగా రాబోయే బిపిసిఎల్ సంస్థకు భూసేకరణ సాధ్యమవుతుంది అని, అలా కాకుండా రైతులు భూమితో పెట్టుబడి పెట్టే విధానం, రైతులను భయపెట్టి భూమిని లాక్కొనే విధానం ఉంటే భూసేకరణ ప్రక్రియ క్లిష్టతరంగా మారి బిపిసిఎల్ లాంటి ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడే పరిస్థితులు వస్తే కందుకూరు అభివృద్ధికి ఇలాంటి ఆరోపణలు అవరోధంగా మారుతాయి అని అన్నారు. నవయుగ సంస్థ ఈ అంశం మీద వివరణ ఇవ్వకపోతే టిడిపి అధినాయకత్వంతో ఉన్న సంబంధాలతో స్థానిక నాయకత్వాన్ని భయపెట్టి రైతులు సమస్యల మీద మాట్లాడే పరిస్థితి లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే ఆంధ్రజ్యోతి పేపర్ లో ప్రథమ శీర్షికలో వచ్చేలా చేశారు అని, కందుకూరు ప్రాంత అన్ని పార్టీల స్థానిక నాయకత్వం భావిస్తుంది అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గా వెనుకబడిన కందుకూరు ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ ఆ అభివృద్ధిలో మా రైతులను కూడా భాగస్వామ్యం చేసే విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని, ప్రస్తుత ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. అలా జరగని పక్షంలో రైతులు పక్షాన నిలబడి రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుంది అని అన్నారు.

