ఊబకాయం అధిక బరువుపై అవగాహన కల్పించిన జీవన్

0

ఊబకాయం అధిక బరువుపై అవగాహన కల్పించిన జీవన్ 

BSBNEWS - గుడ్లూరు  

మారుతున్న జీవనశైలిలో ప్రతి ఒక్కరు అధిక బరువు, ఊబకాయంపై అవగాహన కలిగి ఉండాలని జీవనజ్యోతి వెల్ నెస్ క్లబ్ సభ్యులు జీవన్ అన్నారు. మండల కేంద్రమైన గుడ్లూరు లోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం అధిక బరువుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ నేటి సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమంది ఊబకాయంతో ఇబ్బందులు పడుతున్నారని తద్వారా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు. సాక్షాత్తు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అధిక బరువు ఊబకాయంపై ప్రజల్లో అవగాహన పంచాలని పిలుపునివ్వటం మంచి శుభ పరిణామం అని అన్నారు. అధిక బరువు, ఊబకాయం, ఇతర సమస్యలతో బాధపడేవారు మరిన్ని వివరాలకు 8096463704, 9618891644 ఫోన్ నెంబర్ల లో సంప్రదించి తగిన వివరాలు పొందవచ్చు అన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)