ప్రవీణ్ పగడాల మృతికి న్యాయ విచారణ జరిపించాలి

0

 ప్రవీణ్ పగడాల మృతికి న్యాయ విచారణ జరిపించాలి 

BSBNEWS - KANDUKUR 


డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతికి న్యాయ విచారణ జరిపించాలని కందుకూరు నియోజకవర్గం లోని క్రైస్తవుల అన్ని చర్చిల పాస్టర్స్ ల ఆధ్వర్యంలో బుధవారం శాంతియుత నిరసన ర్యాలీని పట్టణంలోని ఎస్వీఎస్ కళ్యాణమండపం నుండి ఎన్టీఆర్ సర్కిల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవుల పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతికి గల కారణాలను పోలీసులు బహిర్గతం చేయాలని వారు పేర్కొన్నారు. డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతి పలు అనుమానాలకు దారితీస్తుందని అనుమానాలను నివృత్తి చేయాల్సిన పోలీసు అధికారులు మౌనం వహించటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ పాస్టర్స్ లు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)