బాలికల చేత వెట్టి చాకిరి తగదు

0

బాలికల చేత వెట్టి చాకిరి తగదు 

చర్యలు లేకుంటే ధర్నా చేపడతాం

ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్

BSBNEWS - కందుకూరు 

కందుకూరు పట్టణంలోని బాలికాసదనంలో బాలికల చేత వెట్టి చాకిరి చేస్తున్న సిబ్బందిని వారిపై చర్యలు తీసుకొని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు చేవూరి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలిక సదనంలో ఉన్న సిబ్బంది, అధికారులపై పలుమార్లు ఫిర్యాదులు అందినా, ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకోకపోవడం సరికాదని వారు హెచ్చరించారు. నిన్న ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన వార్త కథనం కు నెల్లూరు నుండి జిల్లా అధికారులు బాలికాసదనంలో మంగళవారం విచారణ చేపట్టారు. అయితే జిల్లా అధికారులతో బాలికాసదనం సిబ్బంది, అధికారులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం అందిందని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు బాలికాసదనముకు వెళ్లినా లోనికి అనుమతించకుండా ఏమైనా ఉంటే ఐసిడిఎస్ కార్యాలయానికి రావాలని చెప్పటంతో పలు అనుమానాలకు దారితీస్తుందని వారు ఆరోపించారు. బాలికల చేత వెట్టిచాకిరి చేపిస్తున్న వారిని, వెంటనే సస్పెండ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ధర్నా చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. వెట్టిచాకిరి చేపిస్తున్న వారిపై చర్యలు తీసుకునేంతవరకు మరింత కార్యాచరణ రూపొందించుకొని పోరాటం చేస్తామని హెచ్చరించారు. వారిపై చర్యలు లేకపోతే నిర్వహించే ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నెల్లూరు జిల్లా కార్యదర్శి మస్తాన్, ఏఐఎస్ఎఫ్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పవన్, ఏఐవైఎఫ్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు యర్రంశెట్టి ఆనందమోహన్, ఏఐవైఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి బొజ్జ చంద్రమోహన్ లు పాల్గొంటారని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)