రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని పోకూరు ఆక్స్ ఫర్డ్ స్కూల్ హాస్టల్, వే బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సింగమనేనిపల్లి గ్రామానికి చెందిన బాశం దినేష్ (23) అనే యువకుడు మృతి చెందినట్లు గుర్తించారు. సింగమనేనిపల్లి గ్రామం నుండి పోకూరు మీదుగా ద్విచక్ర వాహనంపై కందుకూరు వైపు అతివేగంతో వెళ్తూ ముందు వెళుతున్న కారును ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వలేటివారిపాలెం ఎస్ఐ మరిడి నాయుడు తెలిపారు.

