దివ్యాంగులలో ఉత్సాహం నింపిన సబ్ కలెక్టర్

0

 దివ్యాంగులలో ఉత్సాహం నింపిన సబ్ కలెక్టర్ 

BSBNEWS - KANDUKUR 

పట్టణంలోని కోవూరు రోడ్డు లో ఉన్న దివ్యాంగుల పాఠశాలలలో మంగళవారం సబ్ కలెక్టర్ శ్రీ పూజిత తన కుటుంబ సభ్యులతో కలిసి పరిశీలించి దివ్యాంగులలో కొత్త ఉత్తేజాన్ని నింపారు. సబ్ కలెక్టర్ రాకతో దివ్యాంగులు ఆనందోత్సవంలో మునిగిపోయారు. దివ్యాంగులతో సబ్ కలెక్టర్ ప్రేమానురాగాలతో ఆప్యాయంగా పలకరించి వారిని దగ్గరికి తీయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక ఉన్నత అధికారిని అన్న దర్పం లేకుండా  అందరితో తమ సొంత ఇంటి వారితో ఉన్నట్టే నడుచుకోవటం చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపించారు. దివ్యాంగుల కోసం తనతో పాటు తీసుకొచ్చిన పెన్సిల్లు, పుస్తకాలు, పెన్నులు తోపాటు వారికి అవసరమైన ఆట వస్తువులను దివ్యాంగులకు సబ్ కలెక్టర్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులను గౌరవించి వారికి ప్రేమను పంచాలని ఆమె కోరారు. వారితో సెల్ఫీలు దిగి వారిని మరింత ఉత్సాహపరిచింది. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి, దివ్యాంగులకు అందించే వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)