డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు 11వ రోజు నివాళులు అర్పించిన కందుకూరు బార్ అసోసియేషన్
BSBNEWS - కందుకూరు
స్వతంత్ర భారత మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి,రాజ్యాంగ రూపకర్త, లౌకిక ప్రజాస్వామ్య భారత విశ్వజ్ఞానజ్యోతి, కుల నిర్మూలన సామాజిక విప్లవాది, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఏఏడి అసోసియేషన్, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ, దమ్మచక్ర ఫౌండేషన్ ఆధ్వర్యం ఏప్రిల్ 1నుండి 13వ తారీకు వరకు జరుగుతున్న నివాళులు అర్పించు కార్యక్రమంలో భాగంగా 11వ రోజు కందుకూరు బార్ అసోసియేషన్ ఆద్వర్యంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి.శ్రీధర నాయుడు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినదని దేశాన్ని ఐక్యంగా ఉంచటంలో భారత రాజ్యాంగం ఎంతో తోడ్పడుతున్నదని రాజ్యాంగాన్ని రూపొందించిన భారత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కందుకూరు బార్ అసోసియేషన్ తరపున నివాళులర్పిస్తున్నామని తెలిపారు. అలాగే సామాజిక న్యాయ పితామహుడు, స్త్రీ విద్యా హక్కు రూపకర్త మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సింగరాజు పవన్ కుమార్, సీనియర్ న్యాయవాదులు వై సాంబశివరావు, ముప్పవరపు కిషోర్, పోకూరి కోటయ్య,షేక్ షంసుద్దీన్, దారా మాధవ రావు, షేక్ యాసిన్, చుండి మురళీధర్, షేక్ ముస్తాక్, ఏ ఏ డి అసోసియేషన్ గౌరవధ్యక్షులు గేరా.చిరంజీవి, ఉపాధ్యక్షులు చనమాల. కోటేశ్వరరావు ,జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు ముప్పవరపు కిషోర్, దమ్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు ఉపాసక గాండ్ల హరిప్రసాద్,అంబేద్కర్ వాదులు మద్దులూరి రమణయ్య, డి. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


