ఎక్సైజ్ ఎస్సైగా పదోన్నతి పొందిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్
- అభినందించిన ఎక్సైజ్ సీఐ, సిబ్బంది
BSBNEWS - KANDUKUR
కందుకూరులో ప్రొహిబిషన్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సిహెచ్ రవి ప్రసాద్ పదోన్నతి పై ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టడం ఆనందించదగ్గ విషయమని కందుకూరు ఎక్సైజ్ సీఐ బి.వెంకట్రావు తెలిపారు. పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎస్సై గా పదోన్నతి పొందిన సిహెచ్ రవి ప్రసాద్ ను ఎక్సైజ్ సీఐ బి. వెంకట్రావు శుక్రవారం శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ తన కృషితో కందుకూరులోనే హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ సబ్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది కందుకూరు లోనే బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని ఆయన కృషి వల్లనే ఈ స్థానం ఆయనకు లభించిందని ఆయన అన్నారు. కష్టపడితే ఫలితం దక్కుతుందని అనడంలోని నిర్వచనకు సిహెచ్ రవి ప్రసాద్ ముందున్నాడని ఆయన అన్నారు. ఎక్సైజ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ రవి ప్రసాద్ మాట్లాడుతూ వెన్నంటి ఉండే నన్ను ముందు నడిపించిన సీఐ వెంకట్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతోపాటు సహకరించిన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

