99 టీవీ రిపోర్టర్ రామును పరామర్శించిన స్పందనపురి జర్నలిస్టు సంఘం నాయకులు

0

 99 టీవీ రిపోర్టర్ రామును పరామర్శించిన స్పందనపురి జర్నలిస్టు సంఘం నాయకులు

BSBNEWS - గుడ్లూరు 

కందుకూరులో 99 టీవీ చానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్న గౌడ్ రాముని స్కందపురి జర్నలిస్ట్ సంఘం నాయకులు శుక్రవారం పరామర్శించారు. 99 టీవీ రిపోర్టర్ రాము ఇటీవల కంటి శస్త్ర చికిత్స చేయించుకొని దారకానిపాడు గ్రామంలోని వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్కందపురి జర్నలిస్ట్ సంఘం నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. కందుకూరు జర్నలిస్టు సంఘం అధ్యక్షులు ఉప్పుటూరి మాధవరావు, రామును ఫోన్లో పరామర్శించారు. వైద్య ఖర్చులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రామును పరామర్శించిన వారిలో స్పందపురి జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రం ఆదినారాయణ, స్కందపురి జర్నలిస్ట్ సంఘం సభ్యులు బోయళ్ళ మురళి, సుదర్శి నాగేశ్వరరావు, బొలిగర్ల మనోహర్ తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)