వక్ఫ్ బోర్డ్ బిల్లు ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు
కందుకూరు లో కదం తొక్కిన ముస్లిం సోదరులు
BSBNEWS - కందుకూరు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డ్ ను ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు హెచ్చరించారు. పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, ముస్లిం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను, క్రైస్తవులను ఇబ్బందులకు గురి చేసే విధంగా, వారి హక్కులను కాలరాసే విధంగా చట్టాలు తీసుకువస్తుందని బిజెపి ప్రభుత్వం చేసిన ప్రతి చట్టానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని వారు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వెంటనే బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. గత వైసిపి ప్రభుత్వం అప్పుడు బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదం తెలిపితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ బిల్లును కు ఆమోదం తెలపడం సిగ్గుచేటని వారు అన్నారు. ముస్లింలకు హాని కలిగించే విధంగా బిజెపి ప్రభుత్వం వివిధ రకాలుగా ప్రయత్నాలు చేయటం సమంజసం కాదని ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొని రావటం వారి పతనానికి నాంది అని వారు హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మీ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని సమస్య పరిష్కరించే విధంగా చూస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య, నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, సిపిఎం నాయకులు ఎస్ఏ గౌస్, మున్వర్ సుల్తానా, ముస్లిం నాయకులు మహాభాష, షేక్ రఫీ, సందాని, తదితర ముస్లిం నాయకులు పాల్గొన్నారు.



