విద్యను అర్థమయ్యే రీతిలో బోధించాలి - సబ్ కలెక్టర్

0

 విద్యను అర్థమయ్యే రీతిలో బోధించాలి


- సబ్ కలెక్టర్

BSBNEWS - KANDUKUR



విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేపట్టాలని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సూచించారు. పట్టణంలోని అమలనాధుని వారిపాలెం ప్రాధమిక పాఠశాలను సబ్ కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు చదువు ఎలా సాగుతుందో పరిశీలించారు. ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని, ఉన్నత చదువులు చదివి సమాజ హితానికి దోహదపడాలని విద్యార్థులకు అమె ఉద్బోధించారు. ఈ సందర్భంగా సదరు పాఠశాలలో వివిధ తరగతులు చదువుతున్న 20 మంది విద్యార్థులకు ఆధార్ లేదని ఆమె గుర్తించారు. దానికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న మున్సిపల్ కమిషనర్ అనూషకు సూచనలు చేశారు. పిల్లలకు పుట్టిన తేదీ ధృవపత్రాల సమస్యకు ప్రత్యామ్నాయం చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆమె ఆదేశించారు. పాఠశాల తరగతి గదులను విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట కందుకూరు మండల విద్యాశాఖ అధికారి కె. సుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)