ఘనంగా వలేటి రాఘవులు నాలుగో వర్ధంతి వేడుకలు
BSBNEWS - KANDUKUR
సిపిఐ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కామ్రేడ్ వలేటి రాఘవలు నాలుగో వర్ధంతి వేడుకలు ఓవి రోడ్ లోని ఆయన స్థూపం వద్ద ఘనంగా జరిగాయి. ముందుగా వలేటి రాఘవులు ధర్మపత్ని ఓలేటి కోటేశ్వరమ్మ జెండా ఆవిష్కరణ చేయగా సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పోకూరు మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నిబద్ధతగల కమ్యూనిస్టుగా తన జీవితాన్ని పార్టీకి అంకితం చేశాడని కందుకూరులో మున్సిపల్ కౌన్సిలర్ గా సిపిఐ తరఫున గెలిచి అనేక ప్రజా సమస్యలను మున్సిపల్ కౌన్సిల్లో ప్రశ్నించేవాడని అన్నారు. అంతటి వ్యక్తి మన మధ్య లేకపోవడం పార్టీకి తీరనిలోటు అని, ఆయన అడుగుజాడల్లో పార్టీ సభ్యులు నడవాలని పిలుపునిచ్చారు. సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ కామ్రేడ్ వలేటి రాఘవులు జీవితం మనందరికీ ఆదర్శమని, పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం ఆయన పార్టీ చేసిన విశేష కృషి ని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నే తన ఇంటిపేరుగా పిలిపించుకుని కమ్యూనిస్టు రాఘవులుగా అందరి మనసులో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారారు. ఈ కార్యక్రమంలో ఓలేటి స్టాలిన్, సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎస్కే హుస్సేన్, వై.ఆనందమోహన్, కే మురళి, నత్తా రామారావు, డి ఆదినారాయణ, కోటేశ్వరరావు, బాల బ్రహ్మచారి, ఆలూరి చంద్ర, దండోరా దాస్, వలేటి రాఘవులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

