పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- ఏఐటియుసి, సిఐటియు
BSBNEWS - KANDUKUR
కందుకూరు మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని మున్సిపాలిటీ పెరిగిన జనాభా ప్రాతిపదికన పారిశుద్ధ కార్మికుల సంఖ్య పెంచాలని పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన కనీస వసతులను సకాలంలో అందించాలని వారు కోరారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్నందున అన్ని పనులకు వారిని వినియోగిస్తున్నారని దాంతో పారిశుధ్య సమస్య పరిష్కారం కావడంలేదని వారు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులపై పని భారం ఎక్కువ వేయటం వల్ల పారిశుద్ధ్య కార్మికులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచి మున్సిపాలిటీలో పేరుకుపోతున్న పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కే అనుషకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనంద మోహన్, సిఐటియు నాయకులు ఎస్ ఏ గౌస్, ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కాకుమాని రవణమ్మ, నాయకులు పులి నాగేశ్వరరావు, మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


