నెల్లూరు అపోలో అందుబాటులోకి రోబోటిక్ సర్జరీ
BSBNEWS - కందుకూరు
మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని నెల్లూరు అపోలో హాస్పిటల్ లో రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అపోలో ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శశిధర్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్థోపెడిక్ సీనియర్ కన్సల్టెంట్, రోబోటిక్ ని రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఇప్పటివరకు మహా నగరానికి పరిమితమైన రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల అత్యాధునిక టెక్నాలజీతో నిర్వహించే ఈ రోబోటిక్ సంస్థ ఇప్పటికీ విజయవంతమైంది అని, నెల్లూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల వారి సౌకర్యార్థం రోబోటిక్ సర్జరీ ఇప్పుడు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. గతంలో నిర్వహించే మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సలలో అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. అయితే రోబోటిక్ మోకాలి మార్పిడి సర్జరీ ద్వారా కచ్చితత్వంతో పాటు రోగికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం, నొప్పి కోత తక్కువగా ఉండడం, త్వరగా రికవరీ కావడం వంటివి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ రోబోటిక్ సర్జరీలో ముందుగా సిటీ స్కాన్ ఆధారంగా కంప్యూటర్లే త్రీడీ నమూనాను రూపొందించుకొని ఆ తరువాత రోగి ఏ భాగంలో ఆపరేషన్ చేయాలో ఒక కచ్చితంగా ఏర్పాటు చేసుకొని రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్ టెక్నాలజీ ద్వారా వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పారు. దీని ద్వారా రోగి త్వరగా కోల్పోవడంతో పాటు శస్త్ర చికిత్స అనంతరం కూడా నొప్పి లేకుండా తన సాధారణ కార్యకలాపాలను కొనసాగించుకోగలుగుతారని వెల్లడించారు. మహానగరానికి పరిమితమైన ఈ మోకాల మార్పిడి రోబోటిక్ సర్జరీని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతినెల రెండవ శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కందుకూరు డాక్టర్ హుస్సేన్ హాస్పిటల్ లో అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజ్మహల్ హుస్సేన్ హాస్పిటల్ డాక్టర్ అజ్మహల్ హుస్సేన్, డాక్టర్ ఆసియా బేగం, డాక్టర్ రహీం, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

