బంగారు బిడ్డ కావాలంటే నేటి అమ్మను తయారు చేద్దాం

0

 బంగారు బిడ్డ కావాలంటే నేటి అమ్మను తయారు చేద్దాం

- ఘనంగా 7వ జాతీయ పౌష్టికార మాసొత్సవాలు 

BSBNEWS - కందుకూరు     


బంగారు బిడ్డ కావాలంటే నేటి అమ్మను తయారు చేద్దాం అనే నినాదంతో అంగన్వాడి కార్యకర్తలు ముందుకు పోవాలని సిడిపిఓ శర్మిష్ఠ అన్నారు. పట్టణంలోని యానాదిపాలెం అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ శర్మిష్ట అధ్యక్షతన 7 వ జాతీయ పౌష్టికాహార మాస ఉత్సవాలలో భాగంగా 1000 రోజుల గురించి 1000 రోజులలో పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత గురించి గర్భవతులు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 0 నుండి 2 సంవత్సరాల పిల్లలకు వ్యాధి నిరోధక, టీకాలు గురించి, సందర్శనల గురించి, తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లుల చేత, అంగన్వాడి కార్యకర్తల చేత తల్లిపాలనే బిడ్డ పట్టు - రొమ్ము క్యాన్సర్ ను అరికట్టు అని, గర్భస్థ శిశువుకు కావాలి - అమ్మా,నాన్న ఆదరణ అని, గర్భవతికి అత్త, భర్త ధైర్యం - సుఖ ప్రసవానికి ఆదిమూలం అని, భర్త పంచే ధైర్యం, ప్రేమ - బాలింతకు అత్యంత కీలకం అని, చిన్నారికి కావాలి అమ్మ నాన్న ప్రేమ - టీవీ కాదు ఫోన్ కాదు అని పలు నినాదాలతో ప్రమాణాలు చేయించారు. అంగన్వాడి కార్యకర్తలు తమ తమ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు వీటి గురించి అవగాహన కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ శర్మిష్ట, సూపర్వైజర్ ఎల్. లక్ష్మీదేవి, ఏఎన్ఎం, ఆశ బి. షీమా అంగన్వాడి కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)