ముగిసిన పోషణ్ పక్వాడ
BSBNEWS - కందుకూరు
పట్టణంలోని దూబగుంటలో పోషన్ పక్వాడ ముగింపు కార్యక్రమాలు సూపర్వైజర్ లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల అభివృద్ధి కోసం అవసరమైన పోషకాలను అందించటమే పోషన్ పక్వాడ ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. గర్భవతులు, బాలింతలు, పిల్లలలో పోషకాహార ఫలితాలను మెరుగుపరిచేందుకు పోషన్ పక్వాడ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి పోషన్ పక్వాడ ప్రారంభం జరిగిందని 22వ తేదీకి ముగింపు కార్యక్రమం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ప్రభుత్వం గర్భవతులు, బాలింతలు, చిన్నారుల పోషక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను చేపడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. పోషన్ పక్వాడ కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం పై అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి అవగాహన చేయటం జరిగిందని పౌష్టికాహార లోపం లేని పిల్లలను తయారు చేయటమే అంగన్వాడీ కార్యకర్తల లక్ష్యమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు అర్బన్ పరిధిలోని ఏ సెక్టార్ అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.


.jpeg)
.jpeg)