తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు
BSBNEWS - కందుకూరు
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు. పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం మహాత్మ జ్యోతీరావు పూలే జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని కోవూరు రోడ్ లో గల మహాత్మ జ్యోతీరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతీరావు పూలే జీవిత పోరాటం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆయన ఆశయాలే మనకు ప్రేరణ సమాజానికి సేవ చేయాలంటే ఆయన చూపిన మార్గంలో నడవాలి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పట్టణ టిడిపి మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, రాష్ట్ర బీసీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధుబాబు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు ముచ్చు వేణు, పార్టీ నాయకులు చదలవాడ కొండయ్య, బెజవాడ ప్రసాద్, కూనం నరేంద్ర, వడ్డెళ్ళ రవిచంద్ర, సవిడిబోయిన వెంకటకృష్ణ, కొత్తూరు వెంకట సుధాకర్, పబ్బిశెట్టి వరదరాజ చుండూరి శీను, గుమ్మ శివ, చిత్తారి మల్లికార్జున, అత్తంటి శివకృష్ణ, అద్దంకి మాల్యాద్రి, వడ్లమూడి చెంచు నారాయణ, యర్రా ముసలయ్య, లక్ష్మణరావు, దాసరి ప్రమోద్, మురళీకృష్ణ, కొమర రమణయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

