వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

0

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

BSBNEWS - కందుకూరు


సామాజిక న్యాయ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహంకు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా, సంఘసంస్కర్తగా వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శినికులు పూలే అని అన్నారు. దళిత బహుజనోద్ధారన  కోసం మహాత్మా పూలే జీవిత కాలపు కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)