ఆధునిక భారత సమాజంలో ఆశాజ్యోతి పూలే మహనీయుడు - పోకూరి మాలకొండయ్య

0

 ఆధునిక భారత సమాజంలో ఆశాజ్యోతి పూలే మహనీయుడు 

- సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య 

BSBNEWS - కందుకూరు

భారత సమాజంలో అణగారిన వర్గాలకు విద్యతోపాటు స్వేచ్ఛ స్వాతంత్రం హక్కుల స్పాలంబన కోసం తుది శ్వాస వరకు శ్రమించిన  మహనీయుడు జ్యోతిరావు అని సిపిఐ నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాలకొండయ్య అన్నారు. శుక్రవారం ఫూలే జయంతి కార్యక్రమం సిపిఐ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నియోజవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు పట్టణ పరిధిలో కోవూరు రహదారిలో గల పూలే విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పోకూరి మాల కొండయ్య మాట్లాడుతూ ఆధునిక భారత సమాజంలో అణగారిన వర్గాలకు ఆ వర్గాల ప్రజలకు అండగా నిలబడిన బలహీనవర్గాల ముద్దుబిడ్డ పూలే అని కొనియాడారు. రెండు శతాబ్దాల క్రితం అంబేద్కర్ కన్నా ముందు భారత సమాజంలో బలహీన వర్గాలకు విద్య అందనంత దూరంలో ఉన్న నేపథ్యంలో పాఠశాలలు ఏర్పాటు చేసి అక్షర విజ్ఞానం అందించిన ఆపర మేధావి పూలే అని కొనియాడారు. స్వయంగా తన భార్యతో మహిళలకు పాఠశాలలు పెట్టించి వంటింటికే పరిమితమైన మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు పూలే అని అన్నారు. అలాంటి పూలే ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆనందమోహన్, దుర్గాప్రసాద్, బాల బ్రహ్మచారి, ఉప్పుటూరి మాధవరావు, అల్లూరి చంద్ర, పెయింట్ వర్కర్స్ యూనియన్ నాయకులు బిట్రా శీను, మద్దాల రాముడు, దమ్ము వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)