డాక్టర్ బాబు జగ్జీవన్ రావు కు నివాళులర్పించిన సిపిఐ నాయకులు
BSBNEWS - KANDUKUR
డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 117 జయంతి వేడుకలు సందర్భంగా పట్టణంలోని చర్చి సెంటర్లో ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రావు కాంస్య విగ్రహానికి సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేసి వారి శ్రేయస్సు కోసం ముందుకు నడిచిన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు అని అన్నారు. 28 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి వంటి ఉన్నత స్థానాలను పొందిన వ్యక్తి అని కొనియాడారు. దేశానికి చేసిన ఆయన సేవలు మరువలేనివని బడుగు బలహీన వర్గాలకు మేలు జరగాలంటే ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కొండేపి నియోజకవర్గ కార్యదర్శి కే.వీరా రెడ్డి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, సిపిఐ కార్యవర్గ సభ్యులు షేక్ హుస్సేన్, నాయకులు బొల్లోజుల బాల బ్రహ్మచారి, ఉప్పుటూరి మాధవరావు, కోటేశ్వరరావు, ఆలూరి చంద్ర తదితరులు పాల్గొన్నారు.

