సీతమ్మవారికి 'బంగారు' చీర

0

 సీతమ్మవారికి 'బంగారు' చీర 

BSBNWES





శ్రీరామనవమి సందర్భంగా సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు హరిప్రసాద్ పట్టు వస్త్రాలను నేసారు. పది రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూలవిరాట్‌ను, చీరపై 'శ్రీరామ రామ రామేతి..' శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేసారు. ఒక గ్రాము గోల్డ్ జరీ పట్టుతో నేసిన ఈ ఏడు గజాల చీర బరువు 800 గ్రాములు అని ఆ కార్మికుడు తెలిపారు.

ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టువస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డికి చేనేత కార్మికుడి విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)