మాలకొండలో అభివృద్ధి పనులు పరిశీలన
- భక్తులకు అందుతున్న వసతులపై అధికారులతో సమీక్ష
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ వేద పండితులు, అధికారులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకి వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అధికారులతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం ఏర్పాట్లు చేయాలని, నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని భక్తులకు అందించాలని, అన్నదాన ప్రసాద కేంద్రంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు ఎమ్మెల్యే గారు పలు సూచనలు చేశారు. కొండ దిగువ భాగంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతి రూములను పరిశీలించి, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి సౌకర్యాలను ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు. గోవుల కోసం ఏర్పాటు చేసిన గోశాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సాగర్ బాబు, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, సోమినేని రవీంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.



.jpeg)