క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి...?
BSBNEWS - కందుకూరు
క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాపులపై బెట్టింగ్ లకు బలవుతున్న యువకులను కాపాడేందుకు ఆయన చట్టాలు తీసుకొచ్చిన బెట్టింగ్లకు యువకులు బలవుతూనే ఉన్నారు. కందుకూరు పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో భారత్ గ్యాస్ పైన ఉన్న వెంకటరమణ లాడ్జి లో ఒక యువకుడు ఉరేసుకుని మరణించిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి చెందిన కల్లూరి శివ నాగరాజు (26) కందుకూరుకు వచ్చి పట్టణంలోని వెంకటరమణ లాడ్జిలో రెండు రోజుల క్రితం రూము తీసుకున్నారని, మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకున్నారని తెలుసుకొని పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ వి సాంబశివయ్య సంఘటన స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలను విచారించారు. నాగరాజు బంధువులు తెలిపిన ప్రకారం రెండు నెలల క్రితం ఇంటి నుండి వచ్చాడని హైదరాబాదులో పని చేస్తున్నారని మేము అనుకున్నామని, అయితే విషయం తెలుసుకున్న తరువాత రెండు లక్షల రూపాయలు క్రికెట్ బెట్టింగ్ లో అప్పు అయ్యాడని క్రికెట్ బెట్టింగ్ ల విషయంలో మనస్థాపానికి చెంది కందుకూరికి వచ్చి ఉరి వేసుకొని ఉండవచ్చునని అనుమానాలు వ్యక్త చేశారు. దీంతో పోలీసులు బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.


