జూన్ 1న ఏఐటియుసి కందుకూరు నియోజకవర్గం మహాసభ

0

జూన్ 1న ఏఐటియుసి కందుకూరు నియోజకవర్గం మహాసభ 

BSBNEWS - KANDUKUR 

స్థానిక సిపిఐ కార్యాలయంలో జూన్ 1 ఆదివారం  ఏఐటీయూసీ కందుకూరు నియోజకవర్గం మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభకు కార్మికులు ఏఐటీయూసీ అనుబంధ సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కె.మురళి, యర్రంశెట్టి ఆనందమోహన్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  స్వాతంత్రం రాకముందే కార్మికుల కష్టాల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆర్భవించిందని అన్నారు, ఏఐటీయూసీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు దాటిన ఆనాటి ఈనాటికి, భవిష్యత్తులో సైతం కార్మిక పక్షాన అలుపెరగని పోరాటాల చేస్తుందని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికులునెత్తురు చిందించి  సాధించుకున్న చట్టాలను కాలరాసే ప్రయత్నాలు చేస్తుందని వాటిని అడ్డుకోవాల్సిన అవసరం కార్మికులకు ఉందని ఆ దిశగా ఏఐటియుసి నియోజకవర్గ మహాసభలు నిర్వహించటం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు కార్మికుల చట్టాల గురించి వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ మహాసభలను కార్మికులు విజయవంతం చేయాలని వారు కోరారు.

Post a Comment

0Comments
Post a Comment (0)